Procedure and Story of Sai Vrat in Telugu

https://shirdisaibabastories.org
With utmost blessings and will of Shirdi Sai Baba, after Sai Baba Vrat stories and procedure in English and Hindi, today I am posting it in Telugu Language. I hope that it will be useful to devotees who live abroad and face difficulty in getting vrat books in their preferred languages.


(UDYAPANA) ఉద్యాపన నియమాలు

వ్రతము యధావిధిగ చేసి 9 వ గురువారంతో పూర్తి చెయ్యాలి.

తొమ్మిదవ గురువారం 5 మంది బీదలకు అన్నదానం చెయ్యాలి(భక్తుని స్తోమతను బట్టి)
ఈ వ్రతము యొక్క శక్తిని ప్రజలకు తెలియజేయడానికి సాయిబాబా వ్రతం పుస్తకములను (5లేక11లేక21) ఉచితంగా పంచిపెట్టాలి తొమ్మిదో గురువారం ఈ పుస్తకములను పూజ గృహమునందుంచి పూజించి ఇతరులకు పంచితే ,పుస్తకం ప్రసాదముగా అందుకొనే వారికి దైవానుగ్రహం లభించును.

పైన చెప్పిన నియమాలతో ఈ వ్రతమును ఆచరించి ఈ దానములు గావించినచో సాయిబాబా కృపతో భక్తుని యొక్క కోర్కెలు, ప్రార్థనలు నెరవేరును.

(SAIBABA VRATHA KATHA) సాయిబాబా వ్రతకథ

కోకిల అను సాధువైన స్త్రీ తన భర్త మహేష్ తో ఒక నగరంలో నివసిస్తోంది.పరస్పర ప్రేమానురాగాలతో, అన్యోన్యంగా వారు సంసారం సాగిస్తున్నారు.
కాని,మహేష్ ది దెబ్బలాడు స్వభావం.మరియు అతని మాటలలో,భాషలో సభ్యత అను హద్దులే ఉండేవి కావు.ఇరుగు పొరుగు వాళ్ళకు మహేష్ స్వభావం చాలా ఇబ్బంది కరంగా ఉండేది.కాని కోకిల చాల శాంత స్వభావు రాలైన భక్తురాలు.అపారమైన విశ్వాసంతో ఆమె చాల సహనంతో అన్ని కష్టాలను సహిస్తూ వస్తూండేది.కాలక్రమంగా ఆమె భర్త యొక్క వ్యాపారం దెబ్బతినగా సంసారం సాగడమే కష్టంగ ఉండేది. కాని మహేష్ పొద్దస్తమానం ఇబ్బందులకు గురవుతూ చీటికి మాటికి భార్యతో పోట్లాడుతూ ఉండేవాడు. ఒక రోజు మధ్యాహ్నం ఒక సాధువు వారి గృహము ముందు నిలిచాడు.
ఆ సాధువు కోకిల వదనం చూసి,బియ్యం మరియు పప్పు భిక్షం అడుగుతూ, సాయిబాబా నిన్ను అనుగ్రహించుగాక అని కోకిలను దీవించాడు.

కోకిల చాలా బాధపడుతూ ఈ జీవితంలో తనకు సంతోషమనేది రాయబడి లేదంటూ తన విషాద గాథను చెప్పుకుంది.

ఆ సాధువు ఆమెను సాయిబాబా వ్రతమును 9 గురువారములు ఆచరించమని ఉపదేశించినాడు.వ్రతము సమయమునందు పళ్ళు,పానీయములు లేక ఒక పూట ఆహారము మాత్రము భుజించాలని ఆదేశించాడు. సాధ్యమైతే సాయిబాబా మందిరానికి వెళ్ళి ప్రార్ధించాలని లేదా గృహంలో సాయి పూజను ఆచరించి 9 గురువారములు తన శక్తి సామర్ధ్యాలకు అనుగుణంగా నిర్దేశించబడిన నియమాలను అనుసరించి బీదలకు అన్నదానం గావించి 5 మందికి లేక 11 మందికి శ్రీ సాయి వ్రత పుస్తకములను ఉచితంగా వితరణ గావించాలి.ఈ వ్రత ఆచరణ చాల మహత్వపూరితమైనది.మరియు కలియుగానికి చాల యుక్తమైనది.ఈ వ్రతము భక్తునియొక్క కోర్కెలను తీర్చును.కాని భక్తునికి సాయి పై ప్రగాఢ విశ్వాసం మరియు భక్తి ఉండాలి. ఏ భక్తుడైతే ఈ వ్రతమును
నియమానుసారంగా భక్తిశ్రద్ధలతో ఆచరించునో అతని సమస్త కోరికలు,ప్రార్ధనలు సాఫల్యం గావించును.సాయిబాబా అనుగ్రహం లభించును అని సాధువు చెప్పెను.

కోకిల కూడా ఈ నవ గురువార వ్రతము ఆచరించాలన్నదీక్షను గైకొని నిర్దేశించబడిన సమయానుసారంగా బీద సాదలకు అన్నదానం గావించి సాయి వ్రత పుస్తకములను తొమ్మిదవ గురువారము ఉచితముగా వితరణ గావించి వ్రత దీక్షను పూర్తిగావించినది. అలా కొన్ని రోజులు గడిచిన పిమ్మట ఆమె కష్టాలన్నీ మాయమైనవి. గృహంలో సుఖము,శాంతి వెలిసినవి. మహేష్ యొక్క కలహ స్వభావము శాశ్వతంగా అంతరించినది. అతని వ్యాపారము కొసాగినది. వారి జీవనం వృద్ధి చెందినది. మరియు ఆనందముతో జీవనం కొనసాగించడం మొదలు పెట్టారు.

ఒక దినం సూరత్ నుండి కోకిల యొక్క బావ,అతని భార్య, కోకిల ఇంటికి విచ్చేశారు. వారు తమ పిల్లలు చదువులో బాగా వెనుక పడ్డారనియు, పరీక్షలలో ఉత్తీర్ణులు కాలేదనియు వాపోయారు. కోకిల వారికి 9 గురువారముల సాయిబాబా వ్రతమును గూర్చి వివరించినది. ఆత్మ విశ్వాసం మరియు సహనంతో సాయిబాబాను ప్రార్ధించినచో వారి పిల్లల చదువులలో ప్రగతి చూపునని వారికి సలహా ఇచ్చినది.కోకిల యొక్క బావ భార్య, వారికి వ్రతము యొక్క వివరణలు చెప్పమంది.

(Rules for observing Sai vrat) సాయి వ్రతం చేయుటకు నియమాలు
కోకిల చెప్పింది— తొమ్మిది గురువారములు ఫలములు,పానీయములు తీసుకొని గాని,ఒక సారి మాత్రము ఆహారం తీసుకొని గాని ఉండాలి.తొమ్మిది గురువారములు సాయి మందిరములో సాయినాథుని దర్శనం చేసుకోవాలి.
ఏ భక్తుడైనా స్త్రీ పురుష వయస్సు భేదము లేకుండా ఈ వ్రతమును ఆచరించవచ్చును.
ఏ కులము వారైనా సరే,ఏ మతము వారైనా సరే ఈ వ్రతము ఆచరించవచ్చును.
ఈ వ్రతమును సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో మరియు అత్యంత భక్తితోను ఆచరించినచో మహత్వ పూరితమైన ఫలము ప్రాప్తించును.
ప్రార్ధనలు ఫలించాలంటే,కోర్కెలు తీరాలంటే భక్తి పూరితముగా సాయిభగవానుని ప్రార్ధించి గురువారం రోజున ఈ వ్రతమును ప్రారంభించాలి.
ఉదయమైనను,సాయంత్ర సమయమైనను, ఈ పూజను ఆచరించవచ్చును.
ఒక పలకను సింహాసనముగా అమర్చి ఒక పసుపు వస్త్రమును దానిపై పఱచి,దానిపై సాయినాథుని పటమును గాని,విగ్రహమును గాని ప్రతిష్ఠించి సాయినాథుని నుదుటపై చందనం మరియు కుంకుమ తిలకం దిద్దాలి.పసుపు రంగు పూలమాలను గాని పసుపు రంగు పుష్పములను గాని సాయినాథునికి సమర్పించాలి.
దీప స్థంభంలో సాయి జ్యోతిని వెలిగించి సాంబ్రాణి,అగరు ధూపములను సమర్పించి సాయిబాబా వ్రతగాథను భక్తితో(అధ్యయనం చేయాలి)చదువాలి.
ధ్యానం చేస్తూ సాయిబాబాను ప్రార్థించాలి. హృదయపూర్వకంగా ప్రార్థనలను,భక్తితో కోర్కెలను విన్నవించుకోవాలి. తరువాత సాయినాథునికి నైవేద్యమును సమర్పించాలి.పవిత్ర ఆహార రూపంలోనున్న చక్కెర గాని,మిఠాయిగాని, ఫలములుగాని,నైవేద్యముగా సమర్పించాలి.
వ్రతములో కూర్చున్నవారికి పవిత్ర ప్రసాదమును సమంగా పంచి భుజించాలి.
పాలు గాని,కాఫీ గాని,టీ గాని,లేక మిఠాయిలను గాని,ఫలములను గాని ఆహారముగా సేవించో,లేక వ్రతమును ఆచరించు భక్తుడు ఒకే పూట మాత్రం
(మధ్యాహ్నం/రాత్రి) ఆహారము సేవించి వ్రతమునుఆచరించాలి. పూర్తిగా ఉపవాసం ఉండి గాని,లేదా ఆకలి కడుపుతో గాని ఈ వ్రతము ఆచరించరాదు.
వీలైనచో 9 గురువారములు సాయి మందిరమునకు వెళ్ళి ప్రార్ధించాలి. సాయిబాబా మందిరము దగ్గరలో లేని పక్షంలో గృహంలోనే అత్యంత భక్తితో పూజను ఆచరించాలి.
భక్తులు వేరే గ్రామానికి వెళ్ళిన,ఈ వ్రతమును కొసాగించవచ్చును.
ఈ తొమ్మిది గురువారము లలో స్త్రీలు మైల పడితే లేక ఏదో కారణం చేత గాని,పూజను ఆచరించనిచో,ఆ గురువారం వదిలివేయవచ్చును. ఈ వదిలివేయబడిన గురువారం లెక్కించరాదు. మరియు రాబోవు గురువారం ఈ పూజను ఆచరించి 9 గురువారములూ పూర్తి చేయాలి.

(Miracles)మహిమలు
పై విధముగా సాయివ్రతం చేయాలని కోకిల వారికి వివరించింది. కొన్ని దినముల తరువాత సూరతలో ఉన్న కోకిల అక్కా బావల నుండి కోకిలకు ఉత్తరంవచ్చింది. ఆమె పిల్లలు సాయి వ్రతమును ప్రారంభించినారనియు, పిల్లలు బాగా చదువుతున్నారనియు,తాము సహితం వ్రతము ఆచరించి సాయి వ్రతం పుస్తకములను ఉచితంగా పంచినామని ఆ ఉత్తరం ద్వారా తెలియజేశారు. ఈ వ్రతం ఆచరించడం ద్వారా ఆమె స్నేహితురాలు యొక్క కుమార్తెకు
ఒక చక్కని అబ్బాయితో వివాహం నిశ్చయమైనదనియు, పక్కింటి ఆమె నగల పెట్టె కనపడకపోగా ,వారు సాయివ్రతం ఆచరించిన 2 నెలలకు పోగొట్టుకున్న నగల పెట్టెను ఎవరో ఆగంతకుడు వారికి పంపాడని ఆ ఉత్తరం ద్వారా తెలియజేసింది. ఇంత అద్భుతమైన అనుభవాలను ఉత్తరం ద్వారా కోకిలకు తెలియజేసింది.కోకిల సాయి భగవానుని శక్తిని , సాయివ్రత మహిమను తెలుసుకొనినది. దీనితో సాయినాథుని మీదున్న భక్తి మరీ గాఢమైనది. ఓ సాయినాథా! మమ్ము దీవించుము. మా పై నీ కరుణ,కృపను జూపుము.

Download Sai Vrat Katha in Telugu

Part 1 Click Here to Download

Part 2 Click Here to Download

Credits : http://www.shirdisaibabakripa.org/ Blog


Click here for procedure and story of Sai Vrat in English
Click here for procedure and story of Sai Vrat in Hindi

© Shirdi Sai Baba Life Teachings and Stories

Sign up to receive awesome content in your inbox

We don’t spam!

Share your love
Hetal Patil
Hetal Patil
Articles: 488

15 Comments

  1. Sai Ramji,

    The contributor had provided the scanned copy saying it to be in telugu, in all sincerity it has been posted here, thanks for pointing out the mistake. I hope Baba arranges for someone who comes up with telugu version too.

    Jai Sai Ramji,
    Sai Ki Deewani
    Hetal Patil

  2. Sir..,

    When this Sai baba vrat book in TELUGU version will be posted here… plz inform / intimate me.
    Now I'm in Deira Dubai,UAE. And I need this book in telugu language.
    plz mail me that book to my mail-ID: surender062@yahoo.co.in / surender062@gmail.com
    Here I asked near the temples in Bur Dubai, but not available in Telugu version.
    Hence kindly do the needful action as soon as possible.
    If you find any website having this book in telugu version, plz mail me that link..
    ok.

    Jai Sai Ram

  3. Dear sir,

    plz mail me the required link which has this vrat katha book in Telugu version to me(surender062@gmail.com) or send that book in attachmenst to my mail-ID as given above.
    Now I'm in Deira Dubai, UAE.
    hence kindly do the needful action as soon as possible.

    Thanks & Regards,
    Surender
    JAI SAI RAM

  4. Sai Ramji All Readers and Commentators,

    Links of download links of Telugu version of Sai Vrat Katha has been updated with new ones. I hope it is correct now.

    I would request to please point out if there is any mistake in uploading.

    Jai Sai Ramji
    Sai Ki Deewani
    Hetal Patil

  5. Hello,
    i started this vrat from last week. And i was mistaken that i could eat one time meal and also eat sweets or fruits during the whole day. so thats what i did. So does these 2 weeks count or i just have to begin it from the starting? please answer me quick i will b waiting
    Paromita Poddar

  6. Jai Sai Ram

    The telugu version seems not complete as english version has namavali, bhavani etc please can someone who has it in telugu can post it or either email jsj_klp@yahoo.com it to me please please i really appreciate your time.

    Sab Ka Malik Ek Baba bhala karegaaaaaa……..

  7. Hi Everyone,

    Saibaba 9 Thursdays Vrat in Telugu.
    Saibaba Tommidi Guruvaramula Vratam in Telugu.

    We were able to complete this telugu copy of Saibaba 9 Thursday's Vratam due to the grace of baba during our vrat. This book is a result of a huge effort from my wife.

    Please download/read/correct/distribute as you see fit.

    GDocs Format (Plaint Txt)
    https://docs.google.com/document/d/1DPXnXbdldx1-xMvR0VU_Rtp1csgelRVetu-t5XXBwgU/edit

    PDF Format
    https://docs.google.com/open?id=0ByH1gM3xUIz7THQ0RERjY3RGRGM

    Word Format
    https://docs.google.com/open?id=0ByH1gM3xUIz7UEpDYnIzNk4yb3M

    Cheers
    Kishore

    • Om Sai Ram CHinto,

      Thanks a Lot to you and your wife for this wonderful work. You are blessed by BABA. Keep the good Work. Hope BABA always help you and your family in all ways.. 🙂

      Om Sai ram

  8. Thanks a lot Kishore for sharing the google drive link. I am planning to do sai vrath. I was looking for the book. May SAI Bless all of us.

  9. I am starting Sai vratham today in the evening at what time I have to start the vratham and till now I am on fast after Pooja can I take regular meal and i have one more doubt can we have roti in the afternoon instead of fruits

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *